Sankranthiki Vasthunnam Review:
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి బరిలో చివరి పెద్ద విడుదల. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ఇది మూడో చిత్రం. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా? మా రివ్యూలో తెలుసుకోండి!
కథ:
సత్య అకెళ్ల (అవసరాల శ్రీనివాస్) అనే ఎన్ఆర్ఐ, అమెరికాలో పెద్ద ఐటీ కంపెనీకి సీఈఓ. తెలంగాణ సీఎం ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వస్తాడు. కానీ ఆ సమయంలో బిజ్జు పాండే గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. బిజ్జు తమ్ముడు పప్పా పాండే విడుదల కోసం సత్యను బలిపశువుగా నిలబెట్టారు. కేసు క్లియర్ చేసేందుకు మాజీ ఐపీఎస్YD రాజు (వెంకటేష్) ని పిలుస్తారు. మిగతా కథ పప్పా పాండేని విడుదల చేసి సత్యను ఎలా కాపాడారన్నదే.
నటీనటులు:
వెంకటేష్ ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్. ఆయన డైలాగ్ డెలివరీ, సీరియస్ రోల్‌ను సరదాగా మార్చే క్రమం బాగుంది. బుల్లి రాజు పాత్రలో నటించిన బాలుడు మంచి టాలెంట్ చూపించాడు. అవసరాల శ్రీనివాస్ పర్ఫెక్ట్‌గా న్యాయం చేశాడు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ పాత్రలకు సరిగ్గా సరిపోయారు.
సాంకేతిక అంశాలు:
అనిల్ రావిపూడి దర్శకత్వం ఫస్ట్ హాఫ్ వరకు పక్కా వినోదాన్ని అందించింది. కానీ సెకండ్ హాఫ్‌లో కథ డిస్కనెక్ట్ అయ్యింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ‘గోదారి గట్టు’ పాట బాగా హిట్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ అంచనాలకు తగ్గట్లుగా లేవు. విజువల్స్ కాస్త ఓల్డ్ ఫ్యాషన్‌గా అనిపించాయి.
ప్లస్ పాయింట్స్:
*వెంకటేష్ ఎనర్జీ
*బుల్లి రాజు క్యారెక్టర్
*మ్యూజిక్
*ఫస్ట్ హాఫ్
మైనస్ పాయింట్స్:
-సెకండ్ హాఫ్ చాలా స్లో
-కామెడీ డిస్కనెక్ట్
-కథలో లాజిక్ లేకపోవడం
-ప్రొడక్షన్ వాల్యూస్ పాతవిగా అనిపించాయి
తీర్పు:
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఒకసారి చూడటానికి బాగుంది. ఫస్ట్ హాఫ్ పక్కా ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వగా, సెకండ్ హాఫ్ డల్ అయ్యింది. అయితే వెంకటేష్ స్టార్ పవర్, బ్లాక్‌బస్టర్ పాటలు ఈ సినిమాను కాస్త కాపాడాయి. అనిల్ రావిపూడి తన డైరెక్షన్ తో మరోసారి అలరించారు.
రేటింగ్: 2.75/5
ALSO READ: Daaku Maharaaj OTT రైట్స్ సొంతం చేసుకున్న డిజిటల్ దిగ్గజం!