HomeTelugu Trendingవెంక‌టేష్ కూతురు అశ్రిత నిశ్చితార్థం ఈ రోజే

వెంక‌టేష్ కూతురు అశ్రిత నిశ్చితార్థం ఈ రోజే

7 5టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు వెంక‌టేష్ మామ అవుతున్నాడు. వెంక‌టేష్ పెద్ద కూతురు అశ్రిత ఇప్పుడు పెళ్లి పీట‌లెక్క‌బోతుంది. ఈమె నిశ్చితార్థం కూడా చాలా సైలెంట్‌గా ఈ రోజు జ‌రిగింద‌ని తెలుస్తుంది. ఈమె ప్రేమ వివాహం చేసుకుంటుంది.

ప్ర‌ముఖ బిజినెస్‌మ్యాన్ సురేంద‌ర్ రెడ్డి మ‌న‌వ‌న్ని అశ్రిత ప్రేమించింద‌ని.. ఆయ‌న‌తోనే త్వ‌ర‌లోనే ఏడ‌డుగులు నడవబోతుంద‌ని తెలుస్తుంది. మార్చ్1న వీళ్ల పెళ్లి జ‌ర‌గ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. దీనికి ఇరు కుటుంబాలు కూడా ఒప్పుకున్నాయి. ఆ మ‌ధ్య అబ్బాయి ఇంటికి వెళ్లి మాట్లాడి వ‌చ్చాడు వెంక‌టేష్ అన్నయ్య సురేష్ బాబు. ప్ర‌స్తుతం వెంకీ కూడా కూతురు పెళ్లి ప‌నుల‌తో బిజీగా ఉన్నాడు. వెంక‌టేష్ పెద్ద కూతురు అశ్రిత ప్రొఫెషనల్ బేకర్.

ఫుడ్ బిజినెస్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా అభిరుచి ఉంది. సిటీలో ఇప్ప‌టికే కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి ద‌గ్గుపాటి వారి స‌త్తా చూపిస్తుంది. రామానాయుడు స్టూడియోలో కూడా ఓ స్టాల్ ఎప్ప‌టికీ ఉంటుంది. కూతురు ఇష్టాన్ని కాద‌న‌లేక‌.. ప్రేమ వివాహానికి వెంక‌టేష్ ఓకే చెప్పాడ‌ని తెలుస్తుంది. ఇక వ‌రుడి తండ్రి ర‌ఘురామిరెడ్డి.. మాజీ ముఖ్య‌మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు. మొత్తానికి కూతురు పెళ్లితో వెంకీ ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu