HomeTelugu Trending'సైంధవ్‌' టీజర్‌ అప్డేట్‌

‘సైంధవ్‌’ టీజర్‌ అప్డేట్‌

venkatesh saindhav teaser uవిక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్‌’. శైలేష్‌ కొలను డైరెక్షన్‌లో ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ సినిమాకి వెంకటేశ్‌ 75వ సినిమా. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే మిషన్‌ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది.

బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను అక్టోబర్ 16న లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్‌. మిషన్‌లో బిజీగా ఉన్న వెంకీ టీజర్ అప్‌డేట్‌ లుక్‌ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంతో నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. మేకర్స్‌ సైంధవ్‌ పాత్రలను పరిచయం చేస్తూ ఇప్పటికే విడుదల చేసిన వీడియో నెట్టింట హల్‌ చల్ చేస్తోంది.

ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్‌ మనోజ్ఞగా కనిపించనుంది. రుహానీ శర్మ డాక్టర్‌గా, నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్రలో, కోలీవుడ్‌ యాక్టర్ ఆర్య మానస్ పాత్రలో నటిస్తున్నాడు. చాలా రోజుల క్రితం లాంఛ్ చేసిన సైంధవ్‌ గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 2024 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి తెరకెక్కిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu