‘పీర్ ప్రెషర్’ దాదాపు మనకి పరిచయం లేని పదం.. కానీ అర్ధం చేసుకోగ్లిగితే ఆ పదానికున్న
లోతు తెలిసిపోతుంది. సాధారణంగా ఏ అలవాటైనా అవసరం కోసమో.. సరదా కోసమో
మొదలవుతుంది. కానీ అది ఇష్టంతో మొదలయిందా.. మొహమాటంతో మొదలయిందా అన్నదే
ముఖ్యం. మొహమాటంతో మొదలు పెట్టిన సరదాలెప్పుడూ చివరకి వ్యసనలుగా మిగిలిపోతుంటాయి.
టీనేజ్ లో చాలా మండి ఈ విషయం తెలుసుకోలేక తర్వాత చాలా నష్టపోతుంటారు. హైదరాబాద్
లోని ‘టీనేజ్ సొల్యుషన్స్’ రన్ చేస్తోన్న డా.లలిత ఆనంద్ ఈ టాపిక్ ను అందరికీ పరిచయం
చేద్దామనుకున్నారు. అర్ధం అయ్యేలా చెప్పే వాళ్ళ కోసం వెతికి చివరకి టాలెంటెడ్ రచయిత,
దర్శకురాలైన జెన్నిఫర్ ఆల్ఫోన్స్ కి చెప్పారు. జెన్నిఫర్ బాగా ఆలోచించి అలవాటుకి బానిసైతే
మనిషి కీలు బొమ్మతో సమానం అనే కీలు బొమ్మ కాన్సెప్ట్ తో మెసేజ్ ను మరింత బాగా చెప్పారు.
ఇలాంటి సోషల్ మెసేజెస్ చెప్పడానికి ఎప్పుడూ ముందుండే హీరో వెంకటేష్ కన్సెప్ట్ వినగానే
ఎగ్జైట్ అయి రెడీ అయ్యారు. బాలల దినోత్సవం రోజు వీడియో విడుదల చేయగానే 48 గంటల్లోనే
లక్షకి పైగా వ్యూస్ తో అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. హీరో రాణా వంటి ప్రముఖ స్టార్స్
సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ వీడియో పబ్లిక్ లోకి వెళ్ళేలా సపోర్ట్ చేస్తున్నారు. దీనికి
మంచి స్పందన రావడంతో త్వరలో సినిమా థియేటర్స్ లో కూడా ప్లే చేయడానికి రెడీ అవుతున్నారు.