HomeTelugu Trendingఓటీటీలో నారప్ప.. రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

ఓటీటీలో నారప్ప.. రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Venkatesh narappa movie rel
విక్టరీ వెంకటేశ్‌ నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. శ్రీకాంత్‌ అడ్డాల డైరెక్షన్‌లో .. తమిళ సూపర్‌హిట్‌ ‘అసురన్‌’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ప్రియమణి, కార్తీక్‌ రత్నం, రావు రమేశ్‌, రాజీవ్‌ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. కాగా, ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. జులై 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ‘నారప్ప’ స్ట్రీమింగ్‌ కానుంది. తొలుత థియేటర్‌లోనే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినా, కరోనా కారణంగా అది వాయిదా పడింది. దీంతో చిత్ర బృందం ఓటీటీవైపే మొగ్గు చూపింది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సురేశ్‌బాబు, కలైపులి ఎస్‌ థాను ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu