ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఓ సీనియర్ హీరో నటించబోతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల రూపొందించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు శేఖర్ కమ్ముల తన తదుపరి ప్రాజెక్ట్ కు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల తన తదిపరి ప్రాజెక్ట్ లో వెంకటేష్ నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. దీంతో వెంకటేష్ కు తగినట్టుగా కథను రెడీ చేసుకుని, త్వరలోనే ఆయన ను కలిసి కథను చెప్పనున్నారట శేఖర్ కమ్ముల. సాధారణంగా వెంకటేష్ న్యూ ఏజ్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తారు. కాబట్టి శేఖర్ కమ్ములకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతా అనుకున్నట్టుగా జరిగితే వెంకటేష్, శేఖర్ కమ్ముల సినిమాపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చు.