సీనియర్ హీరో వెంకటేష్.. వెంకీ మామ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వెంకీ, పాయల్ రాజ్‌పుత్‌లపై పాట చిత్రీకరణ జరుగుతుండగా షూటింగ్‌లో వెంకటేష్ గాయపడ్డారు. వెంకీ కాలు బెణకడంతో డాక్టర్లు రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు. దీంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది.
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ సినిమాలో వెంకీ మామగా వెంకటేష్ నటిస్తుండగా అల్లుడిగా నాగచైతన్య అలరించనున్నాడు. పాయల్ రాజ్‌పుత్, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రియల్ లైఫ్ మామా అల్లుళ్లు, రీల్ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.