టాలీవుడ్ హీరో వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక త్వరలో ఓటీటీ వేదికల వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఓ వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకుల్నీ పలకరించనున్నరట. నిర్మాత సురేష్‌బాబు ఇటీవల ట్విటర్ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. వెంకటేష్ కొత్త ప్రాజెక్ట్ విషయమై పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. వెంకీ త్వరలో నెట్‌ఫ్లిక్స్ కోసం ఓ హిందీ వెబ్‌సిరీస్ చేయనున్నారని స్పష్టత ఇచ్చారు. ఇందులో ఆయనతో పాటు రానా కూడా కలిసి నటిస్తారని వెల్లడించారు. చాలా విభిన్నమైన కథాంశంతో ఈ సిరీస్ రూపొందనుందని, వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్తుందని అన్నారు. దీన్ని హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వెంకటేష్ ప్రస్తుతం ‘దృశ్యం 2’, ‘ఎఫ్ 3’ సినిమాల నటిస్తున్నారు.