HomeTelugu Trendingనన్ను నేను చంపేసుకుంటున్నాను.. వెంకటేష్‌ కామెంట్స్‌ వైరల్‌

నన్ను నేను చంపేసుకుంటున్నాను.. వెంకటేష్‌ కామెంట్స్‌ వైరల్‌

venkatesh 1విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్ధీన్ సిద్ధిఖీ విలన్‌గా నటిస్తున్నాడు. తమిళ హీరో ఆర్య, హీరోయిన్లు శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా, రుహానీ శర్మ, సారా, జయప్రకాష్, కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా (జనవరి 13)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో ప్రమోషన్స్‌ జరుగుతున్నాయి. ఇటీవలే ట్రైలర్‌ విడుదలైంది.

ఈ ట్రైలర్ లాంచింగ్‌ ఈవెంట్‌లో విక్టరీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 75వ చిత్రంగా సైంధవ్ లాంటి సినిమా చేయడం అదృష్టంగా బావిస్తున్నాను అని వెంకటేష్ తెలిపారు. మా మూవీ టీమ్‌ అంత అద్భుతంగా వర్క్ చేశారు. తప్పకుండా మీ అందరికి ఈ సినిమా నచ్చుతుంది. 15వ నిమిషం నుంచే ప్రేక్షకులు సినిమాలో ఇన్వాల్ అవుతారు. సైంధవ్ ప్రేక్షకులు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది” అని వెంకటేష్ చెప్పుకొచ్చారు.

ఈ సినిమా సంక్రాంతికి రియల్ ట్రీట్. తప్పకుండా అందరినీ అలరిస్తుంది” అని విక్టరీ వెంకటేష్ వెల్లడించారు. ఇక ఆయనకు పల్లు ప్రశ్నలు ఎదురైయ్యాయి. వాటిలో న్యూఇయర్‌ తీసుకున్న కొత్త నిర్ణయం ఒకటి.. దీనిపై వెంకటేష్‌ స్పందిస్తూ.. ఇన్నళ్లూ చదివిన విజ్ఞానం అంతా పక్కన పెట్టి ఋర్రను ఖాళీగా ఉంచాలి అనుకుంటున్నాను. అలా తనను తాను చంపుకుంటున్నాను అన్నారు.

venkatesh comments in saind

గత 2-3 సంవత్సరాల నుండి పుస్తకాలు చదవడం ఆపేశాను. మానసింగా ప్రశాంతగా ఉన్నాను. కొన్ని సార్లు మనం నిశ్శబ్దంగా ఉంటే..అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అన్నారు. ఎన్ని పుస్తకాలు చదివినా అన్నీ ఒకేలా అనిపిస్తున్నాయి. నా తెలివితేటల్ని మైండ్‌ నుండి తొలిగించాలి అనుకుంటున్నాను. ఎప్పుడైతే నీ ఋర్ర ఖాలీగా ఉంటుందో అప్పుడు నువ్వు ప్రతిది పొందగలవు, నేర్చుకోగలవు అన్నారు. నిజంగా చెప్పాలంటే నన్ను నేను తాత్వికంగా చంపేసుకుంటున్నాను. అందుకే నేను ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను అన్నారు.

వీటీతో పాటు త్రివిక్రమ్‌తో ఒక మల్టీస్టారర్‌పై ఒక క్లారిటీ ఇవ్వండి అని అడిగారు. అయితే వెంటనే వెంకటేష్ దానికి సమాధానంగా ‘బాబూ ఇప్పుడు ఎవరో ఒకరు త్రివిక్రమ్ కి కాల్ చేసి అడగండమ్మా’ అంటూ నవ్వుతూ సమాధానం చెప్పారు.

ఈ సంక్రాంతికి పలు సినిమాలు విడుదల కానున్నాయి. వాటి మహేష్‌ బాబు గుంటూరు కారం జనవరి 12న విడుదల కానుంది. ముందుగా వస్తున్న మహేష్‌ బాబు ఎక్కువ థియేటర్స్‌ లాగేసుకుంటున్నారు. దీనిపై కూడా వెంకటేష్‌ స్పందించాడు. మహేష్‌ మొత్తం థియేటర్లు తీసేసుకుంటే తనకేం బాధ లేదన్నాడు . తనకు ఎన్ని థియేటర్లు వస్తే.. వాటిలోనే సినిమా విడుదల చేస్తాము అన్నాడు. అందరూ బాగుండాలి అన్నాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu