HomeTelugu Big Storiesరివ్యూ: వెంకటాపురం

రివ్యూ: వెంకటాపురం

నటీనటులు: రాహుల్, మహిమా, అజయ్ ఘోష్, అజయ్ కుమార్ తదితరులు 
మ్యూజిక్‌: అచ్చు
సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్‌ ఉమ్మడి సింగు
ఎడిటింగ్‌: మధు
నిర్మాతలు: శ్రేయాస్‌ శ్రీనివాస్‌, తూము ఫణికుమార్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వేణు మడికంటి.
హ్యాపీడేస్ సినిమాలో టైసన్ గా కనిపించిన రాహుల్ ఆ తరువాత సోలో హీరోగా నిలదొక్కుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేశాడు. కానీ అతడికి సరైన బ్రేక్ రాలేదు. దీంతో చాలా గ్యాప్ తీసుకొని ‘వెంకటాపురం’ అనే థ్రిల్లర్ కథను ఎన్నుకున్నాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
 
కథ:
ఆనంద్(రాహుల్)పిజ్జా డెలివరీ బాయ్ గా పని చేస్తుంటాడు. ప్రశాంతంగా సాగిపోతున్న అతడి జీవితంలోకి చైత్ర(మహిమా) అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఆనంద్ కు చైత్రతో పరిచయం ఏర్పడుతుంది. ఒకరోజు చైత్ర, ఆనంద్ ను అర్జెంట్ గా కలవమని అడుగుతుంది. చైత్ర ఓ సమస్యలో ఇరుక్కున్నానని ఆ సమస్య నుండి కాపాడమని ఆనంద్ ను కోరుతుంది. అయితే ఆనంద్ ను పోలీసులు అరెస్ట్ చేసి తొమ్మిది నెలల పాటు జైలులో పెడతారు. సలు ఆనంద్ జైలుకి వెళ్లడానికి కారణం ఏంటి..? చైత్రకు వచ్చిన సమస్య ఏంటి..? ఆ ప్రాబ్లం నుండి ఆమె ఎలా తప్పించుకుంది..? చైత్ర కారణంగా ఆనంద్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే వెంకటాపురం. 
 
విశ్లేషణ: 
రెగ్యులర్ కథలకు భిన్నంగా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా హారర్, థ్రిల్లర్ ఇలా పలు జోనర్స్ లో సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ మర్డర్ మిస్టరీ చుట్టూ సాగే కథను థ్రిల్లింగ్ గా చెప్పాలనుకున్నారు వెంకటాపురం చిత్రబృందం. సినిమా మొదలైన కొద్ది సేపటికే కథలోకి ఎంటర్ అయ్యారు. అయితే ఫస్ట్ హాఫ్ ఏమంత ఆసక్తికరంగా చిత్రీకరించలేకపోయారు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం రొటీన్ కథాంశంతో సాగుతుంది. ఇంటర్వల్ ఎపిసోడ్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. దర్శకుడు టేకింగ్ బావున్నప్పటికీ అతడి కథ, కథనాలతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీను కలిగించలేకపోయారు.
 
సినిమాకు మెయిన్ ప్లస్ అజయ్ ఘోష్ నటన. నీచుడైన పోలీస్ పాత్రలో బాగా నటించాడు. రాహుల్ రెండు వేరియేషన్స్ చూపించాలనుకున్నాడు. పక్కింటి కుర్రాడి పాత్రలో బాగానే నటించాడు కానీ తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించే వ్యక్తిగా తన నటనలో అతి కనిపిస్తుంది. మహిమా తన పాత్రలో ఓకే అనిపించింది. 
 
సినిమాలో ప్రతి పాట ఎక్కడో విన్న ఫీలింగ్ ను కలిగిస్తుంది. వినడానికి, చూడడానికి పాటలు ఏవరేజ్ గా అనిపిస్తాయి. నేపధ్య సంగీతం కథకు తగ్గట్లుగా ఉంది. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంటుంది. సినిమాలో ఎక్కువ ల్యాగ్ ఉండకుండా చూసుకున్నారు. వెంకటాపురం ఇదొక మర్డర్ మిస్టరీతో సాగే థ్రిల్లర్ అని సినిమా బృందం తెగ ప్రమోషన్స్ చేసింది. ట్రైలర్స్, పోస్టర్స్ తో ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేసింది. అయితే సినిమా ఎలా ఉంటుందో.. అనే ఆతురతతో సినిమాకు వెళ్ళే ప్రేక్షకుడికి మాత్రం నిరాశ తప్పదు.
రేటింగ్: 2/5 

Recent Articles English

Gallery

Recent Articles Telugu