సినీ నటులు నరేశ్ – పవిత్ర మధ్య పెనువేసుకున్న బంధం… చంద్రబాబు – పవన్ కల్యాణ్ ల మధ్య అల్లుకున్న ప్రేమానుబంధాన్ని తలపిస్తోందని ‘గ్రేట్ ఆంధ్ర వెంకట్ రెడ్డి’ ఒక ఆర్టికల్ రాయించాడు. సిగ్గు ఉండాల్రా, ఇలాంటి పనికిమాలిన రాతలు రాయడానికి, రాయించడానికి. ఈ గ్రేట్ ఆంధ్ర వెబ్ సైట్ చూస్తే పాత్రికేయ విలువలు ఒక్క శాతం కూడా కనిపించవు. కనీసం మానవతా విలువలైనా ఉండాలి కదా. ఈ సదరు పెయిడ్ సైట్ ఓనర్ వెంకట్ రెడ్డిలో ఒక్కశాతం మానవతా విలువలైనా లేవా ?, ఉంటే..కడుపుకు అన్నం తినేవాడు ఎవడు ఇలాంటి నీచమైన పోలిక పెట్టి.. అసత్యపు, అనవసరపు అవాస్తవాలను ప్రజలపై రుద్దడు. అసలు ఈ దిగజారిన వార్త వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందరా ?, నీ వల్ల ఏమీరా రాష్ట్రానికి ఉపయోగం వెంకట్ రెడ్డి ?.
పవన్ – చంద్రబాబు చేసే అస్తిత్వ, న్యాయ పోరాటం పై విషపు రాతలు రాయించడమే పనిగా పెట్టుకున్నాడు ఈ వెంకట్ రెడ్డి అనే నీలి, కూలీ మీడియా ఓనర్. ప్రతిపక్ష పార్టీ నేతలు చేసే మంచి పనిని కూడా చెడుగా చూపిస్తూ విషాన్ని ఎక్కించడమే ఈ వెంకట్ రెడ్డి జాబ్. వీరంతా ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు నాశనం కావడానికి ఈ వ్యక్తులంతా ప్రముఖ పాత్ర పోషించినట్టే. అయినా నాశనం కావడం ఏమిటి ?, ఎప్పుడో మూడున్నర ఏళ్ల క్రితమే ఆంధ్ర రాష్ట్రం సర్వ నాశనం అయిపోయింది. అందరికీ అన్యాయం చేసేసి.. ఇంకా ఈ వెంకట్ రెడ్డి లాంటి వ్యక్తులు తమ గురించి తాము గొప్పగా నీతిమంతులుగా అభివర్ణయించుకోవడం కలి కాలానికి నిర్వచనం అనుకోవాలి.
కానీ.. కోట్ల మంది ప్రజల కన్నీరు వెంకట్ రెడ్డి లాంటి వ్యక్తుల సర్వనాశనానికి పునాదులుగా మారక తప్పదు. అయినా చంద్రబాబు నివాసానికి పవన్‌కల్యాణ్ వెళ్లగానే నీలి మీడియాలో పెద్ద రాజకీయ దుమారం చెలరేగింది. బాబు – పవన్ మధ్య సాగుతున్న బంధం అనైతిక అనుబంధం అంటూ కథనాలు రాయించారు. ఇదీ సోషల్ మీడియా యుగం. పనికిమాలిన వక్రబుద్ధి వినాశపు వెంకట్ రెడ్డి లాంటి గొట్టంగాళ్ళు ఎన్ని ఆర్టికల్స్ రాయించినా.. ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రజలకు కావాల్సింది మంచి పాలన. లేనిపోని కథనాలు కాదు.
ఏపీ రాజకీయాల్లో బీజేపీని నరేష్ మాజీ రమ్యతో, అలాగే పవిత్రగా పవన్, నరేశ్ గా చంద్రబాబును పోల్చుతూ సెటైర్స్ వేశారు. కానీ.. ప్రజలు పోలిక మరోలా ఉంది. మాహిష్మతి రాజ్యానికి పట్టిన పీడ భల్లాలదేవ జగన్ అయితే, మాహిష్మతి (ఆంధ్ర) రాజ్యానికి, అక్కడ ప్రజలకు భల్లాలదేవ లాంటి జగన్ నుంచి విముక్తి కలిగించడానికి.. బాహుబలి లాంటి చంద్రబాబు, కట్టప్ప లాంటి పవన్ కళ్యాణ్ వస్తారని, రావాలని కోరుకుంటున్నారు. కచ్చితంగా రానున్న ఎన్నికల్లో నీలి అధినేతను, కూలీ రెడ్డిలను చిత్తు చిత్తు చేసి మళ్లీ కోలుకోకుండా దెబ్బ కొట్టడం ఖాయం. అప్పుడు పెయిడ్ సైట్ల రాతలు పట్టించుకునే నాధుడే ఉండకపోవచ్చు. మన ఆంధ్ర రాష్ట్ర బాగు కోసమైనా మిత్రమా ఆ రోజు రావాలని ఆశిద్దాం.
Reference article: