HomeTelugu Newsవడివేలు అనుచిత వ్యాఖ్యలపై.. ప్రముఖుల ఆగ్రహం

వడివేలు అనుచిత వ్యాఖ్యలపై.. ప్రముఖుల ఆగ్రహం

8 11డైరెక్టర్‌ చింబు దేవన్‌, శంకర్‌లపై నటుడు వడివేలు అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన హీరోగా చింబు తీసిన సినిమా ‘ఇంసై అరసన్‌ 24 ఏఎం పులికేసి’. భిన్నాభిప్రాయాల కారణంగా ఈ చిత్రం షూటింగ్‌ ఆగిపోయింది. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో.. చింబు తనకు స్వేచ్ఛ ఇవ్వలేదని, అందుకే గొడవ జరిగిందని వడివేలు విమర్శించారు. మరోవైపు దర్శకుడు శంకర్‌ గ్రాఫిక్స్‌ డైరెక్టరని తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తమిళ నిర్మాతల సంఘం తన కెరీర్‌ను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో వడివేలు వ్యాఖ్యల్ని ఇప్పటికే కోలీవుడ్‌ దర్శకుడు నవీన్‌, నటుడు సముద్రఖని ఖండించారు. ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయం చెప్పారు. వడివేలు గొప్ప నటుడే అయినప్పటికీ.. ‘ఇంసై అరసన్‌ 24 ఏఎం పులికేసి’ సినిమా స్క్రిప్టులో కూడా మార్పులు చేయాలని డిమాండ్‌ చేయడం సరికాదని పేర్కొన్నారు.

కాగా ఇప్పుడు మరో దర్శకుడు వెంకట్‌ ప్రభు ఈ వివాదంపై స్పందించారు. వడివేలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శకులను అగౌరవపరుస్తూ మాట్లాడాన్ని తప్పుపట్టారు. ‘దర్శకుడు షిప్‌కు కెప్టెన్‌ లాంటి వాడు. ఓ సినిమా విజయం సాధిస్తే.. అది మొత్తం యూనిట్‌ విజయమని చెబుతారు. కానీ ఫ్లాప్‌ అయితే.. అది దర్శకుడి తప్పని అంటారు. తనకు పెద్ద హిట్లు ఇచ్చిన దర్శకులపై నటుడు వడివేలు అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం. నేను చింబు దేవన్‌తో కలిసి పనిచేశా. ఆయన మంచి దర్శకుడే కాదు.. గొప్ప వ్యక్తికూడా. ఇక శంకర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నైపుణ్యం, మంచితనాన్ని ఎప్పుడూ గౌరవించాలి. చిత్ర పరిశ్రమలో మనమంతా సంతోషంగా ఉండాలి. ఒకరితో మరొకరం అలా ప్రవర్తించాలి. అంతేకానీ ద్వేషించుకోవడం సరికాదు. ప్రేమను పంచండి’ అంటూ ‘క్రియేటర్స్‌ను మర్చిపోవద్దు’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu