HomeOTTThe GOAT ఓటిటి విషయంలో హర్ట్ అయిన ఫ్యాన్స్.. డైరెక్టర్ ఏమన్నారంటే!

The GOAT ఓటిటి విషయంలో హర్ట్ అయిన ఫ్యాన్స్.. డైరెక్టర్ ఏమన్నారంటే!

Venkat Prabhu Breaks His Silence about The GOAT extended version
Venkat Prabhu Breaks His Silence about The GOAT extended version

The GOAT Deleted Scenes:

తలపతి విజయ్ నటించిన తాజా చిత్రం ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (ది GOAT) తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్ అందుకుంది. ఈ చిత్రం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌కి అందుబాటులో ఉంది. యాక్షన్ డ్రామా జానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు.

సినిమా విడుదలకు ముందే, ఎక్సటెండెడ్ వెర్షన్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో విడుదల అవుతుందని భావించిన చాలా మంది ప్రేక్షకులు, నెట్‌ఫ్లిక్స్‌లో కేవలం థియేట్రికల్ వెర్షన్ విడుదల కావడంతో కొంత నిరాశ చెందారు. ఈ విషయం పట్ల దర్శకుడు వెంకట్ ప్రభు స్పందిస్తూ, సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చారు.

“డైరెక్టర్ కట్ కోసం ఇంకా చాలా VFX పనులు అవసరం ఉంది, పూర్తి చేయాల్సిన ఫైనల్ వర్క్ ఉంది. అందుకే, మా నిర్మాతలతో చర్చించి, డిలీటెడ్ సీన్లు లేదా ఎక్స్‌టెండెడ్ కట్‌ను త్వరలో విడుదల చేస్తాను. ఇప్పటికి ఈ వెర్షన్‌ను ఎంజాయ్ చేయండి!” అని పేర్కొన్నారు.

మరి డైరెక్టర్ కట్ ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ప్రభు దేవా, ప్రసాద్, అజ్మల్ అమీర్, మిక్ మోహన్, స్నేహ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. ఈ భారీ బడ్జెట్ సినిమాను AGS ఎంటర్టైన్‌మెంట్ నిర్మించగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.

Read More: GOAT సినిమా అతి త్వరలో ఓటిటిలో.. ఎక్కడో తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu