శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్, ఇ.సత్తిబాబు కాంబినేషన్‌లో నవీన్‌చంద్ర హీరోగా నిర్మిస్తున్న చిత్రానికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టైటిల్‌ని ఖరారు చేశారు.
ఈ చిత్రం గురించి నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ.. ”సత్తిబాబు, నవీన్‌చంద్ర కాంబినేషన్‌లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ టైటిల్‌ని కన్‌ఫర్మ్ చేశాం. రెండు పాటలు మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ఒక పాటను ఈనెలలో అరకులో చిత్రీకరిస్తాం. ప్రేక్షకులకు హండ్రెడ్ పర్సెంట్ వినోదాన్ని అందించే హిలేరియస్ ఎంటర్‌టైనర్ ఇది. సత్తిబాబు చాలా ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మా బేనర్‌లో మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది” అన్నారు.
దర్శకుడు ఇ.సత్తిబాబు మాట్లాడుతూ.. ”ఆడియన్స్ కోరుకునే పూర్తి వినోదం ఈ కథలో వుంది. యూనిట్‌లోని ప్రతి ఒక్కరి సహకారంతో సినిమా మేం అనుకున్న దానికంటే బాగా వస్తోంది. దర్శకుడుగా నాకు ఇది మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది. రాధామోహన్‌గారి బ్యానర్‌లో ఈ సినిమా చెయ్యడం హ్యాపీగా వుంది” అన్నారు.