గందపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుదీర్ఘ కాలం పాటు ఇబ్బంది పెట్టిన వీరప్పన్ ను ఎన్ కౌంటర్ చేయడం జరిగింది. వీరప్పన్ చనిపోయిన తర్వాత ఆయన బయోపిక్ లను మరియు ఆయన ఎన్ కౌంటర్ కు సంబంధించిన విషయాలను వెండి తెరపై చూపించారు. రామ్ గోపాల్ వర్మ కూడా వీరప్పన్ పై సినిమా తీశాడు. వీరప్పన్ కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇప్పటికి ఆయన ఇద్దరు కూతుర్లకు జనాల్లో గుర్తింపు ఉంది. ఆ గుర్తింపును ఉపయోగించుకుని ఇద్దరు కూడా రాజకీయాల్లో రాణించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద కూతురు ఇటీవలే బీజేపీలో చేరగా చిన్న కూతురు విజయలక్ష్మి మాత్రం నటిగా మారి అదృష్టంను పరీక్షించుకుంటుంది.
కేఎన్‌ఆర్ మూవీస్ పతాకంపై కేఎన్‌ఆర్. రాజ్శ్రీ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి రవివర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ శుక్రవారం విడుదల చేశారు. విశేషమేమిటంటే మావీరన్ పిళ్లై చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లో విజయలక్ష్మి తండ్రి వీరప్పన్ గెటప్‌లో భుజాన తుపాకీ పట్టుకొని నిలబడ్డారు. దీంతో ఈ చిత్రం కూడా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. ఈ చిత్రంతో వీరప్పన్ వారసురాలు సినీరంగంలో ఎలాంటి పేరును సంపాదించుకుంటారో చూడాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.