విజయ్ దేవరకొండ ప్రస్తుతం మూడు సినిమాలను చేస్తున్నాడు. అందులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఒకటి. ఐదు నెలల క్రితం మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై తిరుగులేని హైప్ తెచ్చిపెట్టింది. పోలీస్ డ్రెస్‌లో మొహానికి ముసుగు ధరించిన పోస్టర్ అప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. అంతేకాకుండా నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియదు అంటూ పోస్టర్‌పై ఓ క్యాప్షన్‌ను ఇచ్చి ప్రేక్షకుల్లో తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.
ఇక గత నెలలో గ్రాండ్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిపారు. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ గన్ పట్టుకుని కాల్చుతున్న పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్డూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు