నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహా హీరోగా నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘వసంత కోకిల’. డెబ్యూ డైరెక్టర్ రమణన్ పురుషోత్తమ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ‘నర్తనశాల’ ఫేమ్ కాశ్మీర పర్దేశి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటకు మంచి స్పందన వచ్చింది. తాజాగా సినిమా టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఓ సముద్రంలో అపస్మారకస్థితిలో తేలియాడుతున్న బాబీ సింహా ను చూపించడంతో టీజర్ ప్రారంభమైంది. రజినీ తాళ్లూరి, రేష్మీ సింహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ భాషల్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.