HomeTelugu Newsబాక్సర్‌గా వరుణ్‌ తేజ్‌ కొత్త సినిమా ప్రారంభం

బాక్సర్‌గా వరుణ్‌ తేజ్‌ కొత్త సినిమా ప్రారంభం

10 21
మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి ఒక సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇందుకోసం కొంతకాలంగా వరుణ్ తేజ్ బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్నాడు. అయితే ఈ సినిమా షూటింగును ఈ రోజు మొదలు పెట్టనున్నారు. వైజాగ్‌లో ఈ సినిమా షూటింగును ఆరంభించనున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ వైజాగ్ చేరుకున్నాడు.

కాగా షూటింగును ప్రారంభించడంతోనే రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించడం విశేషం. జూలై 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అల్లు వెంకటేశ్ – సిద్ధూ ముద్ద కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీత అందిస్తున్నాడు. 35 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో, వరుణ్ తేజ్ జోడీగా ‘సయీ మంజ్రేకర్’ కనిపించనుంది. తెలుగులో ఈమెకి ఇదే తొలి సినిమా కావడం విశేషం. మిగతా వివరాలను త్వరలోనే తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu