HomeTelugu Trending'వాల్మీకి' వచ్చేస్తున్నాడు

‘వాల్మీకి’ వచ్చేస్తున్నాడు

1 10మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ‘ఎఫ్‌2’ తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టి.. డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ప్రస్తుతం ఓ తమిళ రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘వాల్మీకి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించింది మూవీయూనిట్‌.

వరుణ్‌ తేజ్‌ నెగెటివ్‌ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో అథర్వ కూడా ఓ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో వరుణ్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ సినిమాను సెప్టెంబర్‌ 6న విడుదల చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రీమేక్‌ను హరీష్‌ శంకర్‌ తెరకెక్కిస్తుండగా.. మిక్కి జే మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu