ఈ సంక్రాంతిపై మెగా అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. రామ్ చరణ్ యొక్క ‘వినయ విధేయ రామ’ భారీ విజయం అందుకుంటుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా చిత్రం మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాపై ప్రేక్షకులు చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. కానీ మరో మెగా హీరో వరుణ్ తేజ్ తన ‘ఎఫ్ 2’ సినిమాతో వాళ్ళకి ఊరటనిచ్చాడు. నిన్ననే రిలీజైన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుని హిట్ దిశగా సాగుతోంది. దీంతో ఈ సంక్రాంతికి మెగా ఫ్యామిలీ ఖాతాలో కూడ విజయం నమోదైంది.