మెగాప్రీన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గని’. ఏప్రిల్ 8న విడుదలైన గని బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయింది. వీకెండ్స్‌లోనూ పెద్దగా కలెక్షన్లు రాబట్టలేక డిజాస్టర్‌గా మిగిలింది. ఈ క్రమంలో గని సినిమాపై వరుణ్ తేజ్ ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. ‘ఎన్నో ఏళ్లుగా మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు నేను సర్వదా విధేయుడిని. గని మూవీ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ, మరీ ముఖ్యంగా నిర్మాతలకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు.
ఒక మంచి సినిమాను మీ ముందుకు తీసుకువచ్చేందుకు చాలా శ్రమించాము. కానీ మా ఆలోచనలను అనుకున్నరీతిలో తెరపై చూపించలేకపోయాము. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయాలనే ఉద్దేశ్యంతోనే నేను ప్రతి సినిమా చేస్తాను. ఈ క్రమంలో కొన్నిసార్లు గెలుస్తాను, మరికొన్నిసార్లు సినిమా ఫలితాల నుంచి నేర్చుకుంటాను. ఏదేమైనా కష్టపడి పనిచేయడం మాత్రం ఆపను’ అంటూ ట్వీట్ చేశాడు వరుణ్ తేజ్.
— Varun Tej Konidela (@IAmVarunTej) April 12, 2022