మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నడు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో దర్శకత్వంలో గని మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ నేపధ్యంలోతెరకెక్కుతున్న ఈ సినిమాలో బాక్సర్‌గా సత్తా చాటేందుకు సిద్ధమౌతున్నాడు. ఈ మూవీ షూటింగ్ గ్యాప్‌లోనే అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఎఫ్3 సినిమా చేస్తున్నాడు. పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా తెరెకెక్కుతున్న ఈ మూవీతో మరోసారి బాక్సీఫీస్ హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఈ గ్యాప్‌లో వరుణ్ మరో మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘గరుడవేగా’తో ఇండస్ట్రీలో హిట్‌ను అందుకున్న ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు చెప్పిన స్టోరీ లైన్ నచ్చి వరుణ్ వెంటనే ఆ ప్రాజెక్టును ఓకే చేసినట్లు ఇండస్ర్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. సినిమా కథ ప్రకారం చిత్ర షూటింగ్ మొత్తం లండన్‌లోనే జరగనున్నట్లు సమాచారం. కరోనా ఎఫెక్ట్ సద్దుమణిగాక ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే వరుణ్‌తో ప్రాజెక్టు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.