మెగా వారసుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుకలు మెగా ఇంట్లో ఊపందుకున్నాయి. ఇద్దరూ కలిసి షాపింగ్ చేస్తున్నారు. వీరిద్దరి పెళ్లి ఇటలీలో జరుగనుందని తెలుస్తోంది. ఆ తరువాత హైద్రాబాద్లో భారీ ఎత్తున రిసెప్షన్ వేడుకలు నిర్వహించబోతోన్నారని సమాచారం. అయితే ఇప్పుడు ఈ జంట ఇటలీకి వెళ్లినట్టుగా టాక్.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల శుభ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేర్లను ప్రత్యేకంగా వేయించారు. ఇటలీలో జరిగే పెళ్లికి అతి కొద్ది మంది సభ్యులను మాత్రమే తీసుకెళ్తున్నట్టుగా సమాచారం. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే వరుణ్ లావణ్య పెళ్లికి హాజరుకాబోతోన్నారు.
ఆ తరువాత హైద్రాబాద్లోని ఎన్ కన్వెన్షన్లో భారీ ఎత్తున ఏర్పాటు చేసే రిసెప్షన్ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేయనున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం వేడుకలు, బన్నీ స్పెషల్గా ఇచ్చిన పార్టీ పిక్స్ నెట్టింట్లో బాగానే వైరల్ అయ్యాయి. ఇక మెగా ఇంట్లో పెళ్లి సందడి మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. నవంబర్ 1న వీరి పెళ్లిఆ తరువాత రిసెప్షన్ వేడుకలు హైద్రాబాద్లో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇటలీలో ఘనంగా జరగనుంది.