HomeTelugu Trendingకొత్త జంట దీపావళి సంబరాలు

కొత్త జంట దీపావళి సంబరాలు

varun tej lavanya tripathi

మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో దీపావళి వేడుకలు సందడిగా జరిగాయి. హైదరాబాద్‌లోని నివాసంలో జరిగిన ఈ వేడుకల్లో నవదంపతులు వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. లావణ్య అత్తారింట్లో తొలి పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. చీరకట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను వరుణ్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. ‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు’ అనే ట్యాగ్‌తో వరుణ్ షేర్ చేసిన ఒక ఫొటోలో నూతన దంపతులు మెరిసిపోయారు.

కోడ‌లితో కొణిదెల ఫ్యామిలీ తొలి దీపావ‌ళిఇక మరో ఫొటోలో నాగబాబు తో భార్య పద్మజ, కూతురు నిహారిక ఫొటోలో కనిపించారు. దీపావళి ప్రత్యేక దుస్తుల్లో కుటుంబ సభ్యులంతా సంతోషంగా కనిపించారు. కాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎలప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలంటూ ఫ్యాన్స్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!