మెగా బ్రదర్ నాగబాబు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక పెళ్ళికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. నిహారిక పెళ్లి బజాలు మరో రెండు నెలల్లో మొగనున్నాయి. ఈ డిసెంబర్‌లో నిహారిక కొణిదెల, చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమైయ్యాయి. కరోనా కారణంగా కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు, దగ్గరి బంధువుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. పెళ్లి పనులన్నింటిని వరుణ్‌తేజ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. పెళ్లి తేదీని త్వరలోనే అందరికీ తెలియజేస్తాం అని పేర్కొన్నాడు.
కాగా ఆగష్టు 13న నిహారిక- చైతన్యల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్- స్నేహ, సాయిధరమ్‌తోపాటు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైయ్యారు. కొన్నిరోజుల క్రితం నిహారిక తన స్నేహితులతో కలిసి గోవాలో బ్యాచిలరేట్ పార్టీ చేసుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.