మెగా ప్రిన్స్ నిహారిక పుట్టిన రోజు నేడు (శుక్రవారం). నేటితో 28వ వసంతంలోకి అడుగుపెడుతున్న నిహారికకు ఇది పెళ్లి తర్వాత మొదటి పుట్టిన రోజు కావడంతో మరింత స్పెషల్‌గా మారింది. ఈ సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వరుణ్‌తేజ్ చెల్లెలు నిహారికకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నిహా…నువ్వు ఇంత పెద్దదానివి అయ్యావంటే ఇప్పటికీనమ్మలేకపోతున్నాను. కానీ నువ్వు ఎప్పటికీ మాకు చిన్నపిల్లలాగే కనిపిస్తావు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచుతావు. నా జీవితంలో నువ్వు ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే బంగారు తల్లీ’..అంటూ ఎంతో ప్రేమగా నిహారికకు పుట్టినరోజు విషెస్‌ను తెలియజేశారు. నేడు నిహారికతన భర్త చైతన్యతో కలిసి ఫలక్నామ ప్యాలెస్‌లో జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే ఫలక్నామ ప్యాలెస్‌కు ఈ జంట చేరుకున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.
Nihaaaaaaa!!
I still can’t believe that you’re all grown up but you will always be my little girl..
You spread such happiness to everyone around you..
I’m so damn lucky to have you in my life!Happy birthday bangaru thalli!
😘😘😘@IamNiharikaK pic.twitter.com/ULw36mOFR4— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 18, 2020