మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలో మలయాళంలో 100 కోట్లు వసూలు చేసిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మోహల్ లాల్ పోషించిన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రీమేక్ రైట్స్ రామ్ చరణ్ తీసుకున్నారు. రీమేక్ చిత్రాల స్పెషలిస్ట్ మోహన్ రాజాకు ఈ సినిమా బాధ్యతలు అప్పగించారు. చిరు నటించబోయే ఈ 153వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ ,సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ కలిసి ఈ చిత్రాన్నినిర్మించనున్నాయి. ఈ సినిమానికి సంబంధించి రోజుకో రూమర్ వస్తూనే ఉంది. తాజాగా వరుణ్ తేజ్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నారని టాక్ వచ్చింది.
‘లూసిఫర్’ ఒరిజినల్ వెర్షన్ లో హీరోతో పాటుగా మరో మూడు కీలకమైన పాత్రలు ఉన్నాయి. అందులో విదేశాల నుంచి వచ్చి ముఖ్యమంత్రి పదవి కోసం పోటీపడే యువకుడి పాత్ర ఉంటుంది. ఇది హీరో చెప్పినట్లు నడుచుకునే తమ్ముడి పాత్ర. మలయాళంలో ఆ క్యారక్టర్ లో వర్సటైల్ యాక్టర్ టోవినో థామస్ నటించాడు. అయితే ఇప్పుడు తెలుగు వర్షన్ లో ఆ పాత్రలో వరుణ్ తేజ్ ని నటింపజేయాలని చూస్తున్నారట. ఇదే కనుక నిజమై తన పెదనాన్న చిరంజీవి సినిమాలో ఆయనకు తమ్ముడిగా కనిపించడానికి వరుణ్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి.