మెగా హీరో వరుణ్ తేజ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘అంతరిక్షం’ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో వ్యోమగామిగా నటిస్తున్నాడు. ‘అంతరిక్షం 9000 KMPH’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది
డిసెంబర్ 21న విడుదలకు సిదంగా అవుతున్న ఈ సినిమా టైలర్‌ను రిలీజ్ చేశారు మూవీయూనిట్. మిరా అనే శాటిలైట్ దారి తప్పటంతో ప్రపంచంలోని కంమ్యూనికేషన్ వ్యవస్థ అంతా కుప్పకూలే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు అంతరిక్షంలో ఆఫీసర్ దేవ్ చేసిన సాహసమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది.
తెలుగులో తొలి స్పేస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆస్ట్రోనాట్‌గా కనిపించేందుకు వరుణ్ తేజ్ ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. స్పేస్ షటిల్‌తో పాటు ఓ ఉపగ్రహం, ఇస్రో వాతావరణాన్ని ప్రత్యేకంగా సెట్ వేశారు. ఈ చిత్రంలో అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, క్రిష్(దర్శకుడు) సంయుక్తంగా నిర్మించారు.