HomeTelugu Trendingవరుణ్, లావణ్య ప్రేమకు ఐదేళ్లు

వరుణ్, లావణ్య ప్రేమకు ఐదేళ్లు

Varun and Lavanya love stor

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ నిశ్చితార్థం నాగబాబు నివాసంలో జరిగింది. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీతో పాటు లావణ్య కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వరుణ్, లావణ్య మధ్య ఐదేళ్ల క్రితమే ప్రేమ చిగురించిందని చెప్పాలి. కానీ బయటకు మాత్రం ఆలస్యంగా వచ్చింది. వరుణ్, లావణ్య బంధం గురించి బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు.

సాధారణంగా సెలెబ్రిటీల మధ్య ప్రేమ వ్యవహారం తెగ ప్రచారం అవుతాయి. కానీ వీరిద్దరి మధ్య బంధం ఛూచాయగా తెలిసినా పెద్దగా ప్రచారం జరగలేదు. లావణ్య, వరుణ్ కలిసి తొలిసారి మిస్టర్ సినిమాలో నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ అనంతరం ప్రేమగా మారింది. అది కాస్త డేటింగ్‌కు దారితీసింది.

అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ సినిమా సమయంలో వీరిద్దరి విషయం బయటకు వచ్చింది. ఇద్దరూ కలిసి పలు ఫంక్షన్లకు హాజరయ్యారు. నిహారిక వివాహ వేడుకలో లావణ్య హాజరైంది. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య బంధంపై ప్రచారం మొదలైంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో ఇరు పెద్దలతో మాట్లాడి ఒప్పించారు.

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్. ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది. తల్లి రిటైర్డ్ టీచర్. ఆమెకు అన్నయ్య, అక్క ఉన్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu