మెగా హీరో వరుణ్ తేజ్ 10వ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్ త్వరలోనే విడుదల కానుంది. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను విడుదలచేసింది చిత్రయూనిట్. ఇందులో కేవలం చేతులు మాత్రమే కనిపిస్తూ బాక్సింగ్‌కు సిద్ధమవుతున్నట్లుగా ఉంది. ఈ నెల 19న ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఫస్ట్‌లుక్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇందులో వరుణ్‌తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఓ పక్క ఎఫ్-3 సినిమా చేస్తూనే తన పదో సినిమాను పట్టాలెక్కించాడు. ఈ సినిమాపై మరిన్ని వివరాలు ఫస్ట్‌లుక్ ద్వారా అందించొచ్చు. ముకుందా సినిమాతో తెరంగేట్రం చేసిన వరుణ్‌తేజ్ ఆ తర్వాత కంచె, ఫిదా, తొలిప్రేమ వంటి సినిమాలు చేశాడు. వెంకటేష్‌తో కలిసి ఎఫ్2 సినిమాలో అదరగొట్టాడు. ఇక వరుణ్ తేజ్ 10వ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.