హీరో వరుణ్ సందేశ్ రూటు మార్చి.. విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. తాజాగా ఈయన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల అయ్యింది. రమేష్ జక్కాల డైరెక్షన్‌లో వస్తున్న ‘యద్భావం తద్భవతి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గురువారం వరుణ్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో వరుణ్ కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ ధరించి నోట్లో సిగరెట్ కాల్చూతూ.. చేతి సంకెళ్ళను తెంచుకుని గన్‌తో ఫైరింగ్ చేస్తున్నాడు. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. దీనితో పాటు.. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మైఖేల్’ సినిమాలో వరుణ్ సందేశ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.
#YadbhaavamTadbhavati 🔫 🔫 pic.twitter.com/qdXoppfU0i
— Varun Sandesh (@itsvarunsandesh) July 21, 2022