Varun Dhawan Next Movie: 2012 లో అలియా భట్ హీరోయిన్ గా పరిచయం అయిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతోనే వరుణ్ ధావన్ కూడా బాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న వరుణ్ ధావన్ ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ కొడుకు.
హిందీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ ధావన్ ఈ మధ్యనే జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన బవాల్ సినిమాతో మరొక సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు ప్రస్తుతం వరుణ్ ధవన్ చేతిలో చాలానే బాలీవుడ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అయితే అన్నిట్లోనూ వరుణ్ ధావన్ సరసన తెలుగు హీరోయిన్లు నటిస్తూ ఉండటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
Varun Dhawan Citadel:
అతి త్వరలో వరుణ్ ధావన్ హీరోగా నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ కి స్పిన్ ఆఫ్ గా విడుదల కాబోతున్న ఈ సిరీస్ లో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కాబోతోంది.
Varun Dhawan Baby John:
మరోవైపు వరుణ్ ధావన్ బేబీ జాన్ అనే సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. కలీస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బేబీ జాన్ లో మన తెలుగు స్టార్ నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. తమిళ్ లో సూపర్ హిట్ అయినా తేరి సినిమా ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు లో విడుదల కాబోతోంది.
తాజాగా తన తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ఒక సినిమా చేయబోతున్నారు అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం కూడా మరొక తెలుగు హీరోయిన్ ని ఎంపిక చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు శ్రీ లీల తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారి ఆ తర్వాత వరుస డిజాస్టర్లు అందుకున్న శ్రీ లీల ఇప్పుడు బాలీవుడ్ లో వరుణ్ ధావన్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది. అయితే ఇలా వరుసగా తన మూడు ప్రాజెక్టులలో తెలుగు హీరోయిన్ లను ఎంపిక చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.