బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మరో 10 రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది. ఈయన గత కొన్నేళ్లుగా నటాషా దలాల్ తో డేటింగ్ చేస్తున్నాడు. ఈమెను పెళ్లి కూడా చేసుకుంటాడని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి గతేడాది ఈ ఇద్దరి పెళ్లి జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. జనవరి 24న ముంబైలోని అలీబాగ్‌లో ఈ స్టార్ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ వివాహానికి చాలా తక్కువ మంది మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. కేవలం 40 నుంచి 50 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అలీబాగ్ లోని బీచ్‌కు ఎదురుగా ఉన్న మొత్తం రిసార్ట్‌ను పెళ్లి వేడుక కోసం ధావన్ కుటుంబం బుక్ చేసుకున్నట్లు ముంబైలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వరుణ్ ధావన్ తండ్రి, డైరెక్టర్ డేవిడ్ ధావన్ ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసాడు. ఇరు కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ నుంచి డేవిడ్ ధావన్‌కు అత్యంత సన్నిహితులు అయిన సల్మాన్ ఖాన్, మరికొందరు హీరోలు మాత్రమే ఈ పెళ్లికి రానున్నారు. జనవరి 22 నుంచి మొదలు పెట్టి 23, 24 మొత్తం 3 రోజులు వరుణ్ ధావన్ పెళ్లి ధూమ్ ధామ్ గా జరగబోతుందని తెలుస్తోంది. బాలీవుడ్ సెలబ్రెటీల కోసం ముంబైలోని ఒక స్టార్ హోటల్ లో ప్రత్యేకమైన పార్టీని కూడా నిర్వహించనున్నారని ప్రచారం జరుగుతోంది.