టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘వరుడు కావలెను’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కింది. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. అక్టోబర్ 29న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ ను జారీ చేశారు. త్వరలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచనున్నారు.