వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఎప్పుడూ సంచలన వ్యాఖలు చేసి వార్తలలో నిలుస్తుంటాడు. ఇప్పుడు ఉపాథ్యాయ దినోత్సవాన్నీ కూడా వదల్లేదు. ‘టీచర్స్ డే’కు, ‘టీచర్స్ విస్కీ’కి లింక్ పెట్టి వాళ్ళను అవమానించినట్టు ట్వీట్ చేశారు. “ఉపాధ్యాయ దినోత్సవం నాడు టీచర్లు, టీచర్స్ విస్కీ తాగి సెలబ్రేట్ చేసుకుంటారా? అని అడిగిన ఆయన జస్ట్ అస్కింగ్ అంటూ ట్యాగ్ పెట్టాడు. అక్కడితో ఆగక తనను ఉత్తమ విద్యార్థిగా, మానవతావాదిగా తీర్చిదిద్దడంలో తన టీచర్లు విఫలం అయ్యారని, అందువల్ల తనకు టీచర్స్ డే అంటే ఏంటో తెలియదని అన్నాడు. తాను ఓ చెడు విద్యార్థిననే అనుకున్నా మంచి ఉపాధ్యాయులకు తనను మంచి విద్యార్థిగా మార్చాలన్న ఆలోచన రాకపోయిందని, అక్కడే టీచర్లు విఫలం అయ్యారని అన్నాడు. దీంతో వారంతా మంచి ఉపాధ్యాయులు కాలేక పోయారని వాళ్ళంతా చెడ్డ వాళ్ళేనని తన గురువుల గురించి చెప్పుకొచ్చాడు వర్మ.
All my teachers miserably failed in making me a good student and a good human being .So I don’t know what to say about TEACHER’S DAY😡
— Ram Gopal Varma (@RGVzoomin) September 5, 2019