ఇండస్ట్రీలో ఎలాంటి వివాదం తలెత్తినా.. విమర్శించడానికి ముందుంటాడు వర్మ. ఒక్కోసారి చిన్న విషయాన్ని కూడా తన కామెంట్స్ తో హాట్ టాపిక్ గా మారుస్తుంటాడు. అలాంటిది కొన్నిరోజులుగా ఆయన వివాదాలకు దూరంగా ఉంటున్నాడు. తన ట్విట్టర్ అకౌంట్ కు కూడా గుడ్ బై చెప్పేశాడు. ఇప్పుడు టాలీవుడ్ లో అందరినీ కుదిపేస్తోన్న విషయం డ్రగ్స్ వివాదంపై ప్రతి ఒక్కరూ కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కానీ వర్మ నుండి మాత్రం ఎలాంటి మాటలు వినిపించలేదు. ఇన్స్టాగ్రామ్ లో ఏమైనా కామెంట్స్ చేస్తాడేమో.. అని చూశారు కానీ చేయలేదు. తాజాగా ఈ విషయంపై వర్మ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సినిమా ఇండస్ట్రీను టార్గెట్ చేసి ఎక్సైజ్ శాఖ ప్రచారం పొందుతోందని, అకున్ సబర్వాల్ అమరేంద్ర బాహుబలిల పేరుని పొందుతున్నాడని అతడితో రాజమౌళి బాహుబలి3 తీయొచ్చని వర్మ సెటైర్లు వేశాడు.
అయితే ఇంతలోనే తన మనసు మార్చుకున్న వర్మ… అకున్ సబర్వాల్ నిజాయితీనీ ఎవరు శంకించరని అన్నారు. డ్రగ్స్ కేసులో ఎలాంటి ఆరోపణలు లేని వారిపై లీకులివ్వడంతోనే ఇబ్బంది వస్తోందని, లీకులతో వారి కుటుంబాలు విషాదంలో మునుగుతున్నాయని చెప్పారు.డ్రగ్స్ సరఫరా అవుతున్నాయనే విషయం అందరికీ తెలుసని అన్నారు. స్కూల్ పిల్లలను కూడా ఇలానే 12 గంటల పాటు విచారిస్తారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ.