HomeTelugu Trendingనాక్కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఎదురైంది: వరలక్ష్మి

నాక్కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఎదురైంది: వరలక్ష్మి

3 1
నటి వరలక్ష్మి తాను సినీ నటుడి వారసురాలినని తెలిసినా కూడా కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం ఎదురైందని పేర్కొన్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చాంశనీయంగా మారాయి. సుప్రీంస్టార్‌ శరత్‌కుమార్‌ వారసురాలు వరలక్ష్మి. ‘పోడాపోడీ’ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఇటీవల విజయ్‌ నటించిన ‘సర్కార్‌’ వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రలు కూడా పోషించి మెప్పించింది. ఇదిలా ఉండగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమ్మడు తనకు ఎదురైన కాస్టింగ్‌ కౌచ్‌ అనుభవం గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె మాట్లాడుతూ.. ” సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌, మీటూ వంటివి బ్యాగ్రౌండ్‌ లేని వారికే ఎదురవుతాయని అనుకోవడం తప్ఫు ఎందుకంటే నాక్కూడా పలుమార్లు ఆ అనుభవం ఎదురైంది. నేను ప్రముఖ నటుడి కుమార్తె అని తెలిసినా.. నన్ను కూడా అలా చేయాలని పిలిచారు. కానీ నేను వాళ్లకు తగిన బుద్ధి చెప్పి మరీ ఆ అవకాశాలను తిరస్కరించానని” చెప్పింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu