తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తమిళ సూపర్ స్టార్ శరత్ కుమార్ మొదటి భార్య కూతురు వరలక్ష్మి. రాధిక వరలక్ష్మి సొంత తల్లి కాదు. ఇది అలా ఉంటే తన సవతి తల్లి రాధిక గురించి వరలక్ష్మీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వరలక్ష్మీ తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఇటీవలే మీడియాతో మాట్లాడిన వరలక్ష్మీ తన సవితి తల్లి రాధిక గురించి మాట్లాడుతూ.. ‘ఆమె నా తల్లి కాదు. కానీ నాతో చాలా ఫ్రెండ్లీగా ఓ ఫ్రెండ్‌లా ఉంటుంది. అంతేకాదు నా కెరియర్ కు సంబందించిన సూచనలు, గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. అయితే నేను ఎప్పుడైనా ఆమెకు ఏదైనా రహస్యం చెబితే.. మాత్రం దాన్ని వెంటనే అందరికీ లీక్ చేసేస్తుంది. అయితే అందులో దురుద్దేశం ఉండదు.. అలా పొరపాటున జరిగిపోతుంది. ఇలా నా రహస్యాలను లీక్ చేసి చాలా సార్లు నన్ను ఇబ్బంది పెట్టింది అని చెప్పుకొచ్చింది వరలక్ష్మి.