టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘యశోద’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా హరి హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఇటీవల పూజతో చిత్రీకరణ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేశారు.
‘యశోద’ ఈ నెల 6న ప్రారంభమై నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటోంది. బుధవారం వరలక్ష్మి షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రధాన తారాగణంపై ఈ నెల 23 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ జరుపుకోనుందని, జనవరి 3 నుంచి రెండో షెడ్యూల్ మొదలు పెట్టి మార్చికి సినిమా మొత్తాన్ని పూర్తి చేస్తామంటున్నారు నిర్మాత. జాతీయస్థాయిలో అందరినీ ఆకట్టుకునేలా థ్రిల్లర్ కథాంశంతో తీస్తున్న చిత్రమిదని అంటున్నారు దర్శకనిర్మాతలు.