డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా ‘హనుమాన్’ అనే సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తేజ సజ్జా హీరోగా నటిస్తున్నట్లు టాక్. తాజాగా ఈ సినిమానికి సంబంధించిన మరో వార్త వైరల్ అవుతుంది. వరలక్ష్మి శరత్‌కుమార్ నటించబోతుందనే వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. విభిన్నమైన పాత్రలతో తమిళ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న వరలక్ష్మి ఈ ఏడాది టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ‘క్రాక్’, నాంది సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచుకుంది. దాంతో వరలక్ష్మికి పెద్ద సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయని సోషల్ మీడియాలో ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. కాగా ఇటీవలే ‘జాంబిరెడ్డి’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ, నెక్స్ట్ సినిమాగా ‘హనుమాన్’ చేయబోతున్నాడు. ఇందులో ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మి శరత్‌కుమార్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. దీనిలో ఎంత నిజం ఉందో తెలిమాల్సి ఉంది.