సీనియర్ నటుడు శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. పలు టాలీవుడ్ సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ‘హనుమాన్’ మూవీలో హీరోకి అక్కగా నటించింది. తాజాగా ఈ తన ఫ్యాన్స్‌కి ఓ శుభవార్త చెప్పింది వరలక్ష్మీ. తన ప్రియుడు నిక్లాయ్ సచ్దేవ్తో ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతకొన్ని రోజులుగా వరలక్ష్మీ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. ఇక వీటిని నిజం చేస్తూ తాజాగా వరలక్ష్మి ముంబైకి చెందిన వ్యాపారవేత్త, గ్యాలరిస్ట్ నిక్లాయ్ సచ్దేవ్తో నిశ్చితార్థం చేసుకుంది. మార్చి 1న ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ ఫొటోల్లో రాధిక, శరత్‌కుమార్ కూడా కనిపించారు. ఇక వరలక్ష్మికి కాబోయే భర్త ముంబైలో ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నారు.
వీరిద్దరూ గత 14 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఎట్టకేలకు తల్లిదండ్రుల అంగీకారంతో వీరు ఒక్కటవుతున్నారు. అయితే వీరి వివాహం ఎప్పుడు జరగబోతుంది అనే విషయాన్ని త్వరలోనే ప్రకటించబోతున్నారు. దీంతో ఫ్యాన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపున్నారు.