HomeTelugu Big Storiesవనిత విజయ్ కుమార్ మూడో భర్తకు తీవ్ర అస్వస్థత

వనిత విజయ్ కుమార్ మూడో భర్తకు తీవ్ర అస్వస్థత

Vanitha vijayakumar husbandనటి వనిత విజయ్ కుమార్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సీనియర్ నటుడు విజయ్ కుమార్-మంజుల దంపతుల వారసురాలిగా పరిశ్రమకు పరిచయమైన వనిత.. సినిమాల్లో వివాదాల వల్లే ఎక్కువ పాపులర్ అయిందని చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా తెలుగు మీడియాలో కూడా ఈమె గురించి వార్తలు పలు వార్తలు వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఈ నటి మూడవ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తనపై విమర్శలు చేసిన వారికి కౌంటర్ ఇస్తూ వనితా విజయ్ కుమార్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే ఆమె మూడో పెళ్లి గోల సద్దుమణుగుతుందనుకుంటున్న సమయంలో ఆమె మూడో భర్త అనారోగ్యం పాలయ్యారు.

వనిత విజయ్ కుమార్ మూడవ భర్త పీటర్ తీవ్ర అస్వస్థతకు గురి అయ్యడంట. దాంతో ఇటీవలే ఆయన్ను ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లుగా ఆమె చెప్పింది. దేవుడిపై భారం వేసిన ఆయన ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నట్లుగా చెప్పింది. ఇలాంటి పరిస్థితులు నాకే రావాలా అంటూ ఎమోషనల్ అయ్యింది. ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది. పీటర్ త్వరగా కోలుకోవాలంటూ వనిత అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. పీటర్ ప్రస్తుతం చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu