వివాదస్పద నటి వనిత గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సీనియర్ నటి మంజుల, నటుడు విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు ఈ వనిత. ఈమె చంద్రలేఖ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా పేరు తెచ్చుకోలేదు. మూడు పెళ్లిళ్లు, వివాదాలు, విడాకులు, విమర్శలతో సంచలన నటిగా ముద్ర వేసుకున్నారు. గత ఏడాది బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 3లో పాల్గొని వార్తల్లో నిలిచింది. గత జూన్‌లో పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఆ వివాహ జీవితం ఎంతో కాలం సజావుగా సాగలేదు. పీటర్ పాల్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే వనిత విజయ్ కుమార్‌ను రెండో పెళ్లి చేసుకోవడం వివాదానికి దారి తీసింది. అంతేకాకుండా కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. ప్రస్తుతం టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నటి వనిత విజయకుమార్ తాను మళ్లీ ప్రేమలో పడ్డానని గురువారం తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆమె ఎవరి ప్రేమలో పడ్డాను అన్నది మాత్రం స్పష్టం చేయలేదు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రకరకాల ప్రచారం ట్రోల్ అవుతుంది
View this post on Instagram