HomeTelugu Trendingడైలమాలో వంగవీటి రాధాకృష్ణ..!

డైలమాలో వంగవీటి రాధాకృష్ణ..!

విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ సీటు వైసీపీలో ముసలం పుట్టేలా చేసింది. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంతో వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణను డైలమాలో పడేసింది. గడప గడపకు వైసీపీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో బెజవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు పోటీ చేస్తాడన్న సంకేతాలను పంపించింది పార్టీ. దీంతో సమావేశంలో నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన రాధా… తానే బెజవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తానని పట్టుబట్టాడు. పార్టీ నిర్ణయంపై రాధా అనుచరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పార్టీకి రాజీనామా చేయగా… మరికొందరు పార్టీ సభ్యత్వాలను బహిరంగంగానే చించేశారు. రాధా ఇంటి దగ్గర ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను కూడా తొలగించడంతో వైసీపీ అంతర్గత వ్యవహారం రచ్చరచ్చగా మారింది.

12 13

అధిష్ఠానం తీరుపై అసంతృప్తితో ఉన్న వంగవీటి రాధా రెండు రోజులుగా సన్నిహితులు, అనుచరులతో సమావేశమవుతున్నారు. మంగళవారం కూడా రంగా, రాధా మిత్రమండలి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపై రాధా చర్చించారు. మరో మూడు రోజులు వేచి చూడాలని అనుచరులు, సన్నిహితులతో రాధా చెప్పారట. సెంట్రల్‌ సీటుపై అధిష్ఠానంతో మాట్లాడదామని.. అప్పటి వరకు ఓపిక పట్టాలని.. ఎవరూ తొందరపడొద్దని సూచించారట. ఇప్పటికీ అందరం వైసీపీలోనే ఉన్నామని గుర్తు చేశారట.

12b 1

వంగవీటి రాధాకు విజయవాడ తూర్పు నియోజకర్గం కానీ, బందరు లోక్‌సభ స్థానం కానీ కేటాయిస్తామని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అధిష్టానం అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందన్నారు. వైసీపీలో వంగవీటి కుటుంబానికి ఎలాంటి అన్యాయం జరగదని.. తగిన గౌరవం, గుర్తింపు ఉంటాయన్నారు. అయితే ఇప్పటికే యలమంచిలి రవికి విజయవాడ తూర్పు సీటు ఇస్తామని హామీ ఇచ్చారంటూ వంగవీటి వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీంతో ఆయనకు కొందరు టీడీపీ నేతలు టచ్‌లో ఉంటూ… పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తుండగా… బెజవాడ సెంట్రల్ టీడీపీ సిట్టింగ్ కాబట్టి ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారని తెలుస్తోంది. అయితే రాధా టీడీపీలోకి వెళ్లడమేంటని కొందరు ప్రశ్నిస్తుండగా… ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా ఇప్పుడే సీట్లపై పట్టు ఎందుకు వైసీపీలోనే కొనసాగితే బాగుంటుందనే అభిప్రాయం మరికొందరు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు జనసేన పార్టీకి కూడా సీనియర్ల అవసరం ఉంది. ఆసక్తిగా ఉన్నవారిని పవన్ కల్యాణ్… పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అలాంటప్పుడు రాధా… జనసేనలోకి వెళ్తారేమోనన్న ప్రచారం కూడా సాగుతోంది. మరి వైఎస్ జగన్‌ రంగ ప్రవేశం చేసి రాధాను ఆపినా ఆశ్చర్యం లేదంటున్నారు మరికొందరు. మరి వంగవీటి రాధాకృష్ణ… వైసీపీలోనే కొనసాగుతారా? టీడీపీలోకి జంప్ అవుతారా? పవన్‌ను కలిసి జనసేన్యంలో కలుస్తారా? అనే చర్చ జరుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu