టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో మరోసినిమా రావాల్సి ఉంది. అయితే వంశీ సిద్ధం చేసిన కథ మహేష్ బాబుకు నచ్చలేదని.. దీంతో మరో స్క్రిప్ట్ సిద్ధం చేయడానికి వంశీ ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి మహేష్.. వంశీ ప్రాజెక్ట్‌ను రద్దు చేసుకుని పరశురామ్ తో సినిమా చేస్తున్నారు. నిజానికి మహేష్ బాబు స్క్రిప్ట్ నచ్చలేదని చెప్పినా వంశీ ఏమీ బాధపడలేదట. మరో స్క్రిప్ట్ సిద్ధం చేస్తాను.. ఈలోపల వేరే కథలు వినండి అని ఆయనే స్వయంగా సలహా ఇచ్చారట. ఇలా రోజుకోవార్త పుట్టుకొస్తుంది ఈ నేపథ్యంలో అసలు విషయం పై క్లారిటీ ఇచ్చాడు వంశీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉంది. కన్ఫర్మ్ అయిన తరువాత ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు చెబుతా. మా కాంబోపై అభిమానులకు ఎంత ఆసక్తి ఉందో.. అంతకంటే ఎక్కువ ఆసక్తి నాకు కూడా ఉంది’ అని వంశీ అన్నారు.