పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ తరువాత నటిస్తున్న మొదటి చిత్రం ‘వకీల్ సాబ్’ విడుదల తేదీని ప్రకటించారు మూవీ యూనిట్. ఉగాది కానుకగా ఏప్రిల్ 9న థియేటర్లలోవిడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొంటుంది. సంక్రాంతి సందర్భంగా ‘వకీల్ సాబ్’ టీజర్‌ను విడుదల చేసిన తెలిసిందే. సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. హిందీలో వచ్చిన ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో ‘వకీల్ సాబ్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి మనకుతెలిసిందే. ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు.