బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన సినిమాల్లో బేబీ ఒకటి. యూత్‌కి ఎక్కువగా కనెక్ట్ అయిన ఈ సినిమాతో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే అభిమానులను సంపాదించుకుంది. రెండు విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంది.
బేబీ మూవీలో గణేష్ ఉత్సవం సందర్భంగా వైష్ణవి చైతన్య డ్యాన్స్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఎలాంటి పాట లేకుండా ఒక మ్యూజిక్ లెంగ్త్‌లో డ్యాన్స్ సాగుతుంది. బేబీ సినిమాలో వైష్ణవి డ్యాన్స్‌ను ఎంజాయ్ చేసిన వారికి ఇది మరో అవకాశం. ఈ సినిమాతో వైష్ణవి మంచి డ్యాన్సర్ అని నిరూపించుకుంది.
బేబీ మూవీ ఈ నెల 25న ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌పై కూడా ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.