మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ‘ఉప్పెన’ తోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టిన హీరో వైష్ణవ్ తేజ్. తొలి చిత్రంతోనే తనదైన నటనతో సముద్రమంత క్రేజ్ సంపాదించుకొని ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. దీంతో వైష్ణవ్ తేజ్‌కి పలు ఆఫర్స్ వచ్చాయి. ఉప్పెన విడుదల కాకముందే క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమాను పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరపుకుంటోంది. ఇందులో వైష్ణవ్‌కు జోడీగా రకుల్ ప్రీత్ నటిస్తుంది. ఇప్పటికే పలు సినిమాలు వైష్ణవ్ చేతిలో ఉన్నాయి. తాజాగా వైష్ణవ్ చేస్తున్న మూడో సినిమా గురించి అప్‌డేట్ వచ్చేసింది.
అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌ను డైరెక్ట్ చేసిన గిరీశయ్యతో చేస్తున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. శుక్రవారం సాయి ధరమ్ తేజ్ క్లాప్ కొట్టి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో వైష్ణవ్ సరసన ఆకాష్ పూరీ ‘రొమాంటిక్’ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. తొలి సినిమాతోనే లక్కీ హీరో అనిపించుకున్న వైష్ణవ్‌తో సినిమా అనగానే కేతిక వెంటనే ఓకే చేసిందట. మరి రెండవ సినిమాతో వైష్ణవ్..మరో హిట్‌ను అందుకుంటాడా అన్నది చూడాల్సి ఉంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.