కన్నడ హీరో రిషి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘వద్దురా సోదరా’. ధన్య బాలకృష్ణన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇస్లాహుద్దీన్ దర్శకత్వంలో వస్తున్న ఈ వినూత్న ప్రేమకథను తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
అలానే ఫస్ట్ లుక్ పోస్టర్ లో చేతికి బాక్సింగ్ గ్లౌజ్ తొడుక్కొని ఉన్న హీరో రిషి ఒక కుర్చీకి బంధించబడి ఉన్నాడు. స్వేచ్ఛా క్రియేషన్స్ మరియు స్టాబ్ ఫాబ్ ప్రొడక్షన్స్ పతాకాలపై ధీరజ్ మొగిలినేని, అమ్రేజ్ సూర్యవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగభూషణ, గ్రీష్మ శ్రీధర్, మహదేవ్ ప్రసాద్, భవానీ ప్రకాష్, అపూర్వ ఎస్ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.