తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం ‘వారసుడు’. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా థియేటర్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. వారసుడు సినిమా ఓటీటీ రైట్స్ ను దక్కించుకున్న అమెజాన్.. ఫిబ్రవరి 10న ఈ సినిమాను ప్రైమ్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ్ భాషల్లో వారసుడు సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటి వరకు దీనిపై అమెజాన్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.